సింగపూర్‌లో కార్లపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

సింగపూర్‌లో కార్లపై వేటు

October 24, 2017

ట్రాఫిక్ సమస్య ప్రతి దేశంలోనూ ఉంది. ఆధునికంగా అభివృద్ది చెందిన సింగపూర్‌లో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ. దాంతో అక్కడి ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.  వచ్చే ఏడాది నుంచి  వ్యక్తిగత వాహనాలను  అంచెలచలుగా  తగ్గించేందుకు సిద్ధమైంది.

సంబంధిత ప్రణాళికలో భాగంగా..  ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. వ్యక్తిగత వాహనాలు ఉపయోగించాలనుకునే వారు ప్రభుత్వానికి అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్ ఫోర్టు ఆథారిటీ (ఎల్ టీఏ) ఈమేరకు  కొత్త చట్టాన్ని  తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతి ఏడాది 0.25 శాతం వాహనాలను తగ్గిస్తూ .. చివరకు వ్యక్తిగత వాహనాలు లేకుండా చేయాలన్నది సింగపూర్  ప్రభుత్వం లక్ష్యం. సింగపూర్ లో వ్యక్తిగత వాహనాని కోనుగోలు  చేయడం అత్యంత ఖరీదైన వ్యవహరం. కారు లేదా బైక్  కొంటే పదేళ్ల పాటు వాడటానికి  ప్రభుత్వానికి  ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎన్‌టైటిల్‌మెంట్ ’ కింద 2 లక్షల 50 వేల రూపాయలు చెల్లించాలి. అంతేకాక ప్రభుత్వం విధించిన వివిధ రకాల పన్నులతో కార్ల ధరలు ఆమాంతం పెరిగాయి. సింగపూర్  భూభాగంలో ఇప్పటికే 12 శాతాన్ని రహదారుల నిర్మాణం కోసం వినియోగించినట్లు ఎల్ టీఏ అధికారులు తెలిపారు