1 నుంచి సింగరేణి ’కారుణ్య’ దరఖాస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

1 నుంచి సింగరేణి ’కారుణ్య’ దరఖాస్తులు

March 15, 2018

సింగరేణి బొగ్గుగని కార్మికుల పిల్లలు కారుణ్య నియామకాల కోసం ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు   చేసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావ్, కార్యదర్శి ఎం రాజిరెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం వారు విలేకర్లతో మాట్లాడారు.కారుణ్య నియామకాలను త్వరగా పూర్తి చేసుందుకు యత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర  ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం కార్మికుల మెడికల్ అన్‌ఫిట్ జబ్బులను 4 నుంచి 16కు పెంచిదని పేర్కొన్నారు.