సింగరేణి కార్మిక సంఘానికి  కేంద్రం సెగ - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి కార్మిక సంఘానికి  కేంద్రం సెగ

December 5, 2017

సింగరేణి ఎన్నికల్లో  గెలుపును ఆస్వాదించకముందే.. TBGKS  ఆనందాలపై  కేంద్రం నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు సింగరేణిలో గెలిచిన యూనియన్ కాలపరిమితి 4 సంవత్సరాలుగా ఉంది. అయితే దాన్ని 2 సంవత్సరాలకు కుదిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

కార్మిక సంఘ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను ఆమోదించే అధికారం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఉంటుంది. జరిగిన ఎన్నికలపై ఫలితాను పరిశీలించి TBGKS గెలుపుని ఆమోదించి, దానితో పాటుగా కాలపరిమితిని 2 సంవత్సరాలుగా చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై TBGKS సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గెలుపుని ఓర్వలేని  కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రతో కాలపరిమితిన తగ్గించిందని విమర్శించారు.

దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కేంద్రమంత్రిగా దత్తాత్రేయ ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సింగరేణి కార్మిక ఎన్నికలు జరగకుండా బిజెపీ కుట్ర చేసిందన్న టీబిజికెఎస్ నాయకులు, ఇప్పుడు కూడా తన అధికారాన్ని ఉపయోగించి కాలపరితిని కుదించిందని మండిపడుతున్నారు.