పాప్ సింగర్ మికాసింగ్ దుబాయ్‌లో అరెస్ట్.. బ్లూఫిల్ములు పంపాడని… - MicTv.in - Telugu News
mictv telugu

పాప్ సింగర్ మికాసింగ్ దుబాయ్‌లో అరెస్ట్.. బ్లూఫిల్ములు పంపాడని…

December 7, 2018

ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ పాప్ సింగర్ మికాసింగ్‌ను దుబాయ్ పోలీసులు గురువారం  తెల్లవారు జామున 3 గంటలకు అరెస్ట్ చేశారు. బ్రెజిల్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువతికి అశ్లీల చిత్రాలు పంపాడన్న ఆరోపణలపై మికాసింగ్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్ వచ్చిన మికా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన దుబాయ్ పోలీసులు విచారణ నిమిత్తం మికాసింగ్‌ను అబుదాబి తీసుకెళ్లారని కచేరీ బృందంలోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం మికాసింగ్‌ను మురక్కాబాత్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని రిపబ్లిక్‌ వరల్డ్ డాట్‌కామ్ వెబ్‌సైట్ తెలిపింది. గతంలో ఐటంగర్ల్ రాఖీ సావంత్‌కు బలవంతంగా ముద్దు పెట్టి మికా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.