దూరదర్శన్ అధికారి నగ్నదర్శనం.. - MicTv.in - Telugu News
mictv telugu

దూరదర్శన్ అధికారి నగ్నదర్శనం..

February 27, 2018

నాలుకకో రుచి..పుర్రెకో బుద్ది అన్నట్లే  ఉంది ఈ అధికారి తీరు గుడ. పూణె దూరదర్శన్‌లో అధికారిగా పనిచేస్తాడు లతీఫా సయ్యద్ అనే ఈ వ్యక్తి.  అయితే సోమవారం రోజు పొద్దున్నే  ఒంటికి టవల్ కట్టుకుని, బకెట్ నీళ్లు తెచ్చుకొని టవల్ విప్పేసి  ఆరు బయట నగ్నంగా స్నానం చేయడం మొదలు పెట్టాడు. గల్లీలో వెళుతున్న వారు అది చూసి ‘చీచీ పొద్దు పొద్దున్నే ఏంటి మాకీ కర్మ’ అని తిట్టుకుంటూ వెళ్లారు. అయితే  వాళ్లను పట్టించుకోకుండా  ఈయనేమో అలాగే జలకాలాడుతున్నాడు.

ఇది గమనించిన ఓ స్వచ్చంద సంస్థ కార్యకర్తలు అతనిని ‘ఇదేంటి బుద్దిలేకుండా, ఒంటిమీద డ్రాయర్ కూడా లేకుండా… ఇంట్లో బాత్రూంలేదా, వెళ్లి ఇంట్లో స్నానం చేసుకో’ అని వారించారు. దానికి ఆయన  ‘మీకెందుకు నా ఇష్టం వచ్చిన చోట స్నానం చేసుకుంటా’ అని వాళ్లతో వాగ్వాదించాడు. దీనితో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనికి  నలుగు పెడదామని పోలీస్ స్టేషన్కుకు తీసుకెళ్లారు.  పోలీసులతో లతీఫ్ అసలు నిజం చెప్పాడు. ‘ డాక్టర్ సూచన మేరకే అలా చేశాను సార్.  ఒంటి మీద ఏం లేకుండా సన్ బాత్ చేస్తే ఒంట్లో ఉన్న రోగాలు పోతాయని డాక్టర్ చెప్పాడు ’ అని పోలీసులతో చెప్పాడు. అయినా సరే  ఒంటి మీద ఏం లేకుండా ఆరుబయట  అలా నగ్నంగా స్నానం చేయడం తప్పని అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే అతను అలా స్నానం చేసిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.