బయటికొచ్చిన సైరా ఫోటోలు - MicTv.in - Telugu News
mictv telugu

బయటికొచ్చిన సైరా ఫోటోలు

March 30, 2018

ఇద్దరు దంపతులు యాగం చేస్తున్నారు. వేద పండితులు వాళ్ళను ఆశీర్వదించారు. ఆ దంపతుల వెనకాల ధ్యాన ముద్రలో పెద్దాయన కూర్చొని వున్నారు. ఇంతకీ ఆ దంపతులు ఎవరో కాదు.. చిరంజీవి, నయనతార. ఆ పెద్దాయనేమో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ‘ సైరా ’ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఇవి. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌‌చల్ చేసేసరికి అదే స్టిల్‌కు సంబంధించిన ఒరిజినల్ ఫోటోతో పాటు, మరో రెడు ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా చిత్రం లీక్ కావడంతో, లీక్ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమితాబ్‌కు సంబంధించిన ఫోటో ఈమధ్యూ స్వయంగా అమితాబే తన ట్విటర్ ద్వారా బయట పెట్టిన విషయం తెలిసింది.