పసిపిల్లను చంపిన యుద్ధం  - MicTv.in - Telugu News
mictv telugu

పసిపిల్లను చంపిన యుద్ధం 

October 24, 2017

అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియా దుస్థితి కళ్లకు కట్టడానికి ఈ చిన్నారి ఫొటోలకు మించిన ఉదాహరణలు అక్కర్లేదు. నెల రోజుల వయసున్న సమర్ దోఫ్ అనే ఈ పసికందును యుద్ధ బీభత్సం పొట్టనబెట్టుకుంది. తూర్పు గౌటాకు చెందిన సమర్ తల్లికి ప్రసవించినప్పటి నుంచి సరైలు పాలు లేవు. ఆ ప్రాంతలో రెబల్స్ కు, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న భీకర యుద్ధం వల్ల నిత్యావసరాలకు కొరత ఎర్పడటమే దీనికి కారణం.

తల్లిపాలు ఎలాగూ లేవు.. కనీసం బర్రెపాలనో, ఆవు పాలనో కొని బతికించుకుందామంటే అవీ దొరకలేదు. పైగా చేతిలో డబ్బుల్లేవు. అయినా పాపను బతికించుకోవడానికి తల్లిదండ్రులు నానా కష్టాలూ పడ్డారు. హమౌరియా పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మరుసటి రోజే సమర్ చనిపోయింది. ఆ పాప భౌతిక కాయం ఫోటోలను ఆసుపత్రి విడుదల చేసింది. వాటిని చూసి ప్రపంచం కన్నీరు మున్నీరవుతోంది. సమర్ చాలా బలహీన స్థితిలో ఆస్పత్రికి వచ్చిందని, ఏడవడానికి కూడా ఆ పాపకు శక్తి లేదని, కన్నీరు సైతం బయటికి రాలేనంతగా శరీరం ఎండిపోయిందని వైద్యలు చెప్పాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సిరియాలో ఇప్పటివరకూ 5 లక్షల మంది ఆకలితో చనిపోయారు.