జనసేనలోకి  శివబాలాజీ! - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనలోకి  శివబాలాజీ!

November 25, 2017

‘ చందమామ ’ సినిమా తర్వాత శివబాలాజీని అందరూ మర్చిపోతుండగా ‘ బిగ్ బాస్ ’ షో ద్వారా ఒక్కసారిగా మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఆ షో ప్రభావంతో ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే శివబాలాజీ రాజకీయాల్లోకి కూడా రానున్నట్టు సమాచారం. తొలుత నుంచి అతనికి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే శివబాలాజీ  ‘ జనసేన ’ పార్టీలో చేరుతాడని సమాచారం. అయితే పవన్ పూర్తి స్థాయిలో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. అందుకని కాస్త ఆలస్యమైనా తన పొలిటికల్ ఎంట్రీ జనసేన ద్వారానే జరగాలని ఫిక్స్ అయ్యాడట. డిజెంబర్ 15 తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.