రాజశేఖర్ కూతురి సినిమా మొదలైంది - MicTv.in - Telugu News
mictv telugu

రాజశేఖర్ కూతురి సినిమా మొదలైంది

March 24, 2018

నటవారసుల హవా నడుస్తోంది ఇప్పుడు. హీరోల కొడుకులే కాదు కూతుళ్ళు కూడా తెలుగు తెర మీదకు హీరోయిన్లుగా సత్తా చాటడానికి వస్తున్నారు. ఈ కోవలోకి ఇప్పుడు రాజశేఖర్ కుమార్తె శివాని కూడా వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అడవిశేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమాకు వెంకట్‌ కుంచం దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రచయిత చేతన్ భగత్ నవల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ 2 స్టేట్స్ ’ తెలుగు రీమేక్‌తో శివాని వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు.

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శివాని తల్లి పాత్రలో నిన్నటితరం నటి భాగ్యశ్రీ నటించనున్నారు. ఈ చిత్ర ప్రారంభానికి కె. రాఘవేంద్రరావు, వివి. వినాయక్, రాజమౌళి, కృష్ణంరాజు, జీవిత, రాజశేఖర్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.