అమ్మకు జయహో..  జన్మే కాదు పునర్జన్మా ఇచ్చింది…

పురిటినొప్పులు భరించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ప్రసవం తల్లికి పునర్జన్మలాంటిదే. అలా ఓతల్లి బిడ్డకు జన్మనివ్వడమే కాదు తన కాలేయం దానం చేసి పునర్జన్మనిచ్చి బిడ్డకు సంపూర్ణ ఆయుష్షు పోసింది. హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన నర్సింగ్‌రావు, మమత దంపతులు. గతేడాది జూలై 18న వారికి ఆడ శిశువు జన్మించింది. ఈ పాపకు మైథిలీ అని పేరుపెట్టారు. అయితే చిన్నారికి పుట్టిన వారానికే ఫిట్స్ రావడం, శరీరం నీలం రంగులోకి మారడం, నిద్రమత్తులో వుండటం వంటి సమస్యలు తలెత్తాయి. హడలెత్తిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ పాప ఆర్గానిక్‌ యాసిడేమియా అనే సమస్యతో ‘మ్యాపిల్‌ సిరప్‌ యూరిన్‌ డిసీజ్‌ (ఎంఎస్ యూడీ)తో బాధ పడుతున్నట్టు గుర్తించారు.Telugu news Six-month-old with genetic disorder undergoes rare liver transplantపాప శరీరంలో అమైనో యాసిడ్స్‌ శాతం పెరుగుతుండడం వల్ల దీని ప్రభావం మెదడుపై పడి కాలేయ సంబంధిత జబ్బుగా మారిందని తెలుసుకున్నారు. ప్రతీ రెండు లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ తరహా జన్యుపరమైన జబ్బు వస్తుందని చెప్పారు. వెంటనే పాపకు కాలేయమార్పిడి చేయాలన్నారు. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. డబ్బు సాయం చేయడానికి కొందరు ముందుకొచ్చారు. చివరికి తల్లే తన బిడ్డకు కాలేయాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చింది. నెల క్రితం శిశువుకు గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడీని విజయవంతంగా నిర్వహించారు. మమత.. తన బిడ్డకు జన్మనే కాక పునర్జన్మ కూడా ఇచ్చిందని వైద్యులు అన్నారు.