బాలికపై 6 నెలలుగా గ్యాంగ్‌రేప్.. 80 ఏళ్ల ముసలోడు కూడా - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై 6 నెలలుగా గ్యాంగ్‌రేప్.. 80 ఏళ్ల ముసలోడు కూడా

February 23, 2018

నిర్భయ చట్టం అమలులో వున్నా ఎవరికీ భయం లేకుండా పోయింది. మానవతను ంచేయటానికి కొందరు కామాంధులు నడుము కట్టుకున్నట్టుకున్నారు. సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా ఓ మైనర్ బాలికపై ఆరుగురు ఆరు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌‌లో వెలుగు చూసింది. ఆరుగురిలో 80 ఏళ్ల వృద్ధుడు కూడా వున్నాడు. ఆమె గర్భం దాల్చటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన భుర రజక్ అనే వ్యక్తి బాధితురాలిపై ఆరు నెలల కిందట అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట చెప్పుకుంటే కుటుంబం పరువు పోతుందని ఆ బాలిక విషయాన్ని దాచింది. దీన్ని అదునుగా తీసుకున్న మరో వ్యక్తి వచన్ రజక్ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెప్తే ముందు జరిగిన అత్యాచారాన్ని బయటకు చెప్తానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక మరింత భయానికి గురై ఈ విషయాన్ని దాచి పెట్టింది. కాగా అతను వెళ్ళి తన మిత్రుల ముందు చెప్పుకున్నాడు. ఆ బాలికను లొంగదీసుకొని మన పని కానియొచ్చని చెప్పుకున్నాడు. అలా ఇంకా నలుగురు బాలికను బెదిరిస్తూ ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. రవి రజక్, సుఖ్‌దేవ్, రాజ్ కుమార్, సోనూ రజక్‌ల ఆగడాలను బాలిక భయంతో మౌనంగా భరించింది.  ఈ విషయం తెలిస్తే కుటుంబం తలెత్తుకు తిరగలేదని భావించింది.

తను గర్భం దాల్చిన విషయాన్ని గ్రహించిన బాధితురాలు తల్లికి చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని బుధవారం ఖమారియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జబల్పూర్ ఎస్పీ శశికాంత్ శుక్లా బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాడు. వెంటనే ఐదుగురిని అరెస్ట్ చేశారు. 80 ఏళ్ళున్న సుఖ్‌దేవ్ పరారీలో వున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిపై అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదుచేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. డీఎన్ఏ పరీక్షల కోసం వారి రక్త నమూనాలను సేకరించారు. ఇదిలా వుండగా ‘ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గుల బెదిరింపులకు భయపడకుండా అమ్మాయిలు ధైర్యంగా ఇంట్లో గానీ, పోలీసులకు గానీ చెప్తే ఎక్కువ నష్టం జరగదు’ అని ఎస్పీ శశికాంత్ శుక్లా చెప్పారు.