అనుష్క బరువును అలా తగ్గించారు...  - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్క బరువును అలా తగ్గించారు… 

October 18, 2017

అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా కోసం  బరువు పెరిగింది.   బరువు తగ్గిన తరువాతనే సినిమాల మీద దృష్టి సారించాలనుకుంది. ఆ దిశగా బరువు తగ్గాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  ప్రస్తుతం అనుష్క చేతిలో ప్రతిష్టాత్మక  ‘భాగమతి ’సినిమా తప్ప మరే సినిమా లేదు. ఈ సినిమాలో అనుష్క‌ను సన్నగా చూపించాలని అనుకున్నాడట దర్శకుడు. కానీ ఆమె మాత్రం ఎంత రన్నింగ్ చేసినా, ఎన్ని బస్కీలు తీసినా  బరువు తగ్గలేదు. బరువు తగ్గకున్నా దర్శకుడు అశోక్  అనుష్క‌తో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. అనుష్క లావును తగ్గించేందుకు గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టాడు. అనుష్క‌ను సన్నగా, నాజుకుగా చూపించడానికి గ్రాఫిక్స్ వర్క్స్ కోసం అదనంగా రూ. 5 కోట్లను ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్కకు  ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ సినిమాలతో మంచి పేరు వచ్చింది. ‘బాగమతి’ కూడా అనుష్కకు మంచి పేరు తీసుకువస్తోందని చిత్ర యూనిట్.