పూలకుండీలో శవాన్ని దాచి.. హైదరాబాద్ వచ్చేశాడు..

 నేరం కూడా నిజంలాగే నిప్పు లాంటిది. నేరం చేసి తప్పించుకుందాం అనుకుంటే పొరబడినట్లే. నేరం ఎప్పడికైనా వెంటాడుతుంది, జైల్లోకి నెట్టేస్తుంది. ఢిల్లీలో స్నేహితుడిని హత్య చేసి పూల కుండీలో దాచి హైదరాబాద్‌కు వచ్చేసిన హంతకుడి ఆటకట్టయింది. ఎప్పుడో ఆనవాళ్లు బయటపడకుండా  చంపేశానని, ఇక తనను ఎవరూ పట్టుకోలేరని ధీమాగా ఉన్న అతడు ఢిల్లీ పోలీసులు రావడంతో షాక్ అయ్యాడు.

Telugu News Skeleton in the flowerbed .

హైదరాబాద్‌కు చెందిన జయప్రకాశ్‌(27), విజయ్‌కుమార్‌(30) బంధువులు, స్నేహితులు. 2015లో ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లారు.  దాబ్రీ ప్రాంతంలోని చాణక్య ప్లేస్‌లోని ఓ భవంతిలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరికీ ప్రైవేట్‌ ఉద్యోగాలు వచ్చాయి. విజయ్‌ ఓ  అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. జయప్రకాశ్‌ ఆమెతో తరచూ మాట్లాడేవాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించి జయప్రకాశ్‌ను హత్య చేయడానికి పథకం వేశాడు. జయప్రకాశ్‌ను చంపేసి, పూలకుండీలో శవాన్ని దాచి పెట్టాడు. తర్వాత తన ఫ్రెండ్ కనపడటం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు నమ్మేయడంతో ఎంచక్కా హైదరాబాద్‌కి వచ్చేశాడు. తాజాగా ఢిల్లీలోని ఆ ఇంట్లో వేరేవాళ్లు అద్దెకు దిగారు. పరిసరాలను శుభ్రం చేస్తుండగా పూల కుండీలో… అస్థిపంజరం కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు నిజం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telugu News Skeleton in the flowerbed: Man murdered nephew for getting close to his girlfriend