mictv telugu

జాగ్రత్త.. రేడియేషన్ ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్ అదే..  

February 9, 2019

ఇది స్మార్ట్ ఫోన్ల కాలం. అందరి చేతుల్లోనూ అవే. ఫోన్ కాల్ నుంచి డబ్బు బదిలీ వరకూ అన్ని పనులూ వాటితోనే పూర్తి చేస్తున్నారు జనం. అయితే దేంట్లోనూ అతి పనికిరాదన్నట్లు స్మార్ట్ ఫోన్లను కూడా అతిగా వాడకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా వెలువడే రేడియేషన్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, కేన్సర్, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయని ఇదివరకే చాలా పరిశోధనల్లో తేలింది.Telugu news smart phones Xiaomi, OnePlus Top List of Phones Emitting Highest Radiation Levels, Samsung Phones Emit Lowest: Reportదీంతో.. తక్కువ రేడియేషన్ ఫోన్లపై జనం దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యవంలో జర్మన్‌ ఫెడరల్ ఆఫీస్‌ ఫర్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ ఓ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచంలో ఏఏ బ్రాండ్ల ఫోన్లు ఎంతెంత రేడియో ధార్మికతను విడుదల చేస్తున్నాయో పరిశీలించింది.

కొన్నేళ్లు తెగ అమ్ముడుబోతున్న షామీ ఎంఐ ఏ1 ఫోన్ అత్యధికంగా రేడియేషన్ విడుదల చేస్తున్నట్లు తేలింది. చైనాకు చెందిన షామీతోపాటు వన్‌ఫ్లస్‌ ఫోన్లు కూడా రేడియేషన్‌ను ఎక్కువగా వదులున్నాయి. దక్షిణకొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ఫోన్లలో రేడియేషన్‌ కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

షామీ ఎంఐ ఏ1 రేడియేషన్‌ స్థాయి 1.74 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌ కాగా, వన్‌ప్లస్‌ 5టీ 1.68 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌ నమోదు చేసింది. షామీ ఎంఐ మాక్స్‌ 3 ఫోన్‌ కిలోగ్రామ్‌కు 1.58 వాట్స్‌ చొప్పున రేడియేషన్‌ను విడుదల చేస్తోంది. ఏతావాతా.. ఎక్కువ రేడియేషన్ ఫోన్లలో తొలి 16 స్థానాల్లో 8 షామీ, వన్‌ప్లస్‌ కంపెనీ ఫోన్లే ఉన్నాయి. ఐఫోన్‌ 7 రేడియేషన్‌ స్థాయి 1.38 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌గా నమోదైంది. ఇక శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 రేడియేషన్ స్థాయి 0.17 వాట్స్‌ పర్‌ కిలోగ్రామ్‌గా రికార్డయింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8, ఎస్‌8 ప్లస్‌, ఎస్‌7 ఎడ్జ్‌, ఎస్‌9 ప్లస్‌, ఎస్‌8 ఫోన్ల రేడియేషన్‌ స్థాయి కూడా 1 వాట్‌ లోపే నమోదైంది.