స్టూడెంట్స్ పనికొచ్చే యాప్స్... - MicTv.in - Telugu News
mictv telugu

స్టూడెంట్స్ పనికొచ్చే యాప్స్…

November 28, 2017

ప్రస్తుతం యాప్‌ల హవా కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి పనికి ఓ యాప్  ఉంటోంది.  స్టూడెంట్స్‌కు ఉపయోగపడే యాప్స్ కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ‘ఆఫీస్ లెన్స్’ ఒకటి.  ఈ యాప్ ద్వారా ఫోటోలను, పేపర్ డ్యాక్యుమెంట్లను పీడీఎఫ్ రూపంలో సులభంగా  మార్చుకోవచ్చు. పీడీఏఫ్‌లోకి మారిన ఫైల్ పెన్ డ్రైవ్‌లో కూడా సేవ్  అవుతుంది. ఏ డివైస్‌లో నుంచి అయిన ఆ ఫైల్‌ను  యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ  యాప్  ఉంటే స్కానర్ ఉన్నట్టే.

క్లాస్ రూమ్ ,నోట్స్, ఇమేజ్‌లను సులభంగా స్కాన్ చేసుకోవచ్చు. బ్లాక్ బోర్డుపై టీచర్ రాసిన ముఖ్యాంశాలను ఫోటో రూపంలో తీసుకోవచ్చు. ఈ యాప్‌లో మరో ఫీచర్ ఓసీఆర్ టెక్ట్స్ ఆధారంగా ఫైల్‌ను సెర్చ్ చేసే వీలువుంది.  టెక్ట్స్ లో మనకు  కావాల్సిన భాగాన్ని హైలెట్ చేసుకోవచ్చు.

మరో యాప్ ‘ఎవర్ నోట్’. ఇది నోట్ టేకింగ్ యాప్‌. డిజిటల్ మెమెరీ యాప్‌గానూ ఉపయోగపడుతుంది. ఈ యాప్ సహయంతో కాలేజీ నోట్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న నోట్స్‌ను ఏ డివైస్‌లోకైనా తీసుకెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు.