ఇంటర్నెట్ నత్తలా ఉన్నా వీడియో కాల్ మాట్లాడొచ్చు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్నెట్ నత్తలా ఉన్నా వీడియో కాల్ మాట్లాడొచ్చు..

March 8, 2018

మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వేగం తగ్గితే చికాకు పుడుతుంది. వీడియో కాల్స్ వంటివి సాధ్యం కావు. వెబ్ సైట్లు కూడా మొరాయిస్తాయి. ఫేస్ బుక్ ఈ సమస్యలకు పరిష్కారం చూపనుంది. స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ తక్కువగా ఉన్న డివైస్‌లో ఫేస్‌బుక్ మెసెంజర్ లైట్ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ యాప్‌‌కి వీడియో కాలింగ్ ఫీచర్‌‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.  ఇంటర్నల్ స్టోరేజ్ 10 ఎంబీ కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఈ యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మెసెంజర్‌ లైట్ యాప్ దాదాపు వంద దేశాల్లోనే అందుబాటులో ఉంది. మెసెంజర్‌ లైట్ సపోర్ట్ చేయని దేశాలలో APKMirror ద్వారా ఈ యాప్‌ ద్వారా యూజర్లు వినియోగించుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.