కేన్సర్ రోగులను నవ్వించే అద్దం - MicTv.in - Telugu News
mictv telugu

కేన్సర్ రోగులను నవ్వించే అద్దం

October 27, 2017

కేన్సర్ పేషెంట్ల కోసం ట‌ర్కీకి చెందిన ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన‌ర్ బెర్క్ ఇల్హాన్‌ ఓ వినూత్న అద్దాన్ని త‌యారుచేశాడు. దీని పేరు ‘స్మైల్ మిర్రర్’. ఈ అద్దం కేవలం నవ్వితేనే పని చేస్తుంది.

నవ్వు కాకుండా వేరే ఎలాంటి హావభావాలు చూపించినా అద్దం పని చెయ్యదంటున్నాడు బెర్క్. తమకు నయం కాని జబ్బు సోకిందని, ఇక చావే గతి అని కేన్సర్ రోగులు నిత్యం బాధ పడుతుంటారు. అలాంటి వారి ముఖాల్లో నవ్వును,  సంతోషాన్ని చూడటమే ఈ అద్ధం తయారీ వెనుకున్న రహస్యం అంటున్నాడు బెర్క్. అలాంటి వారిలో ఈ అద్దం వల్ల ఆత్మన్యూనతా భావాన్ని తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నాడు.

వారు ఈ అద్దాన్ని చూసి కాసింత నవ్వినా చాలంటున్నాడు. అప్పుడు నా ప్రయోగం వందకు వంద శాతం విజయవంతమయినట్టేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ అద్దం మీద విమర్శలూ వస్తున్నాయి.  ఇదొక పనికిమాలిన వ‌స్తువుగా ఎండగట్టి తీసి పారేస్తున్నారు. కొండంత బాధలో వున్నవారిని నవ్వు కోసం ఇబ్బంది పెట్టడం అస్సలు బాగాలేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారి విమర్శలను లెక్కచెయ్యకుండా దీనివల్ల వాళ్ళలో నెమ్మదిగా నవ్వు అనేది అలవాటై ఆత్మస్థైర్యం నిండుతుందనే బెర్క్ చెప్పాడు.