గుజరాత్ సీఎం రేసులో స్మృతి ఇరానీ - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ సీఎం రేసులో స్మృతి ఇరానీ

December 19, 2017

హిమాచల్‌లో అధికార కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి, గుజరాత్‌లో మళ్ళీ తన పాగా వేసింది కమలం. బీజేపీ 99, కాంగ్రెస్ 80 సీట్లను గెలుచుకోగా.. ఇప్పుడు గుజరాత్ సీఎం ఎవరన్న దాని మీద చర్చ జోరుగా సాగుతున్నది.  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా గుజరాత్‌లో ప్రస్తుత సీఎం విజయ్‌రూపానీ గెలిచినప్పటికీ ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతని ముఖ్యమంత్రిగా చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.స్మృతి సీఎం అయితే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. తరువాతి స్థానాల్లో వాజుభాయ్‌ వాలా, మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవ్య  సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే హిమాచల్ సీఎం పరిశీలనలో కేంద్ర మంత్రి జే.పీ. నడ్డా పేరు కూడా వినిపిస్తోంది.