వంట చేస్తూ..పోలీసులకు దొరికిన స్మగ్లర్ - MicTv.in - Telugu News
mictv telugu

వంట చేస్తూ..పోలీసులకు దొరికిన స్మగ్లర్

December 17, 2017

రేణిగుంట కోడూరు రోడ్డు మధ్యలోని శేషాచలం అడవుల్లోని గంజి బండ్ల ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న 10 మంది టాస్క్ ఫోర్స్ సిబ్బందికి  ఆ ప్రాంతంలో వంట చేసుకుంటున్న 30 మంది స్మగ్లర్లు తారస పడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసిన స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు.

దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒక స్మగ్లర్‌ను పట్టుకున్నారు.  ఇతన్ని తమిళనాడు తిరువన్నామలై జిల్లా ఇరుమలైకు చెందిన శరమన్ అంబుగా గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా కేసు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.