పాముల కార్పొరేటర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాముల కార్పొరేటర్

October 23, 2017

ప్రజల సమస్యలను తీర్చడం కార్పొరేటర్ పని, కానీ ఈ కార్పొరేటర్ మాత్రం ప్రజల సమస్యలతో పాటు, పాముల సమస్యలను కూడా తీరుస్తున్నాడు. అతని పేరు శ్యాం.  కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు.

కానీ అతని ప్రవృత్తి మాత్రం పాములు పట్టడం. ఎంతటి విషసర్పాన్ని అయినా అవలీలగా పట్టి, అడవిలో వదిలిపెడతాడు. ఇప్పటివరకు 33 వేల పాముల్ని పట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. గత 20 సంవత్సరాలుగా ఇతని వృత్తి పాములు పట్టడం. ఇన్ని వేల పాములు పట్టిన ఇతన్ని అందరూ ‘స్నేక్ శ్యాం’ అని పిలుస్తారట.