సోడాతో గుండెకు తూట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

సోడాతో గుండెకు తూట్లు..

March 22, 2018

భోజనం చెయ్యగానే చక్కగా ఓ సోడా, పాన్ నమలడం చాలా మందికి అలవాటు. సోడా తాగితే తిన్నది తిన్నగా అరుగుతుంది.. గ్యాస్ట్రిక్ సమస్యలు వుండవని నమ్ముతారు. కానీ ఆ నమ్మకాలు ఇప్పుడు మూఢ నమ్మకాలు అంటున్నారు నిపుణుులు. రోజుకు రెండు సోడా క్యాన్‌లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. చక్కెర ఎక్కువగల పానీయాలు సేవించేవారు గుండెపోటుతో చనిపోతున్నట్టు వారి పరిశోధనలో వెల్లడైంది. తీపి పదార్థాలు తినే వారికన్నా 2 ఔన్సుల సోడాను రోజూ సేవించేవారే రెండింతలు ఎక్కువగా మరణిస్తున్నట్టు  పరిశోధకులు చెబుతున్నారు.45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్‌ వెల్ష్‌ ఈ విషయాలను వెల్లడించారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు. వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.