బల్దియాలో రోబో హల్‌చల్.. ఎంత తెలివిగా మాట్లాడిందో! - MicTv.in - Telugu News
mictv telugu

బల్దియాలో రోబో హల్‌చల్.. ఎంత తెలివిగా మాట్లాడిందో!

February 20, 2018

హాయ్ అయామ్ చిట్టి  మెమరీ 2 టెరాహర్ట్స్  1 గిగాబైట్  అని  రోబో సినిమాలో  ఓ రోబో మాట్లాడితే అందరం ఆశ్చర్య పోయాం. సినిమాలో గ్రాఫిక్స్ లో అలా రోబోను చూపెడితే  నిజంగా చాలా సంతోషపడ్డాం. కానీ నిజ జీవితంలో చిట్టిలా మాట్లాడే రోబోలు ఉన్నాయా? అంటే  సోఫియానే దానికి సమాధానం.  డేవిడ్  హాన్సన్ అనే శాస్త్రవేత్త రూపొందిచిన ఆ రోబో పేరు సోఫియా  హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో రెండో రోజు ఆ రోబో  అందరి దృష్టినీ ఆకర్షించింది.  అంతేకాదు ఈ రోబోకు సౌదీ పౌరసత్వం కూడా ఉంది. మరి  దాన్ని అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పిందో  మీరే చదవండి.

ప్రశ్న: ఒక రోబోగా నీకు విశ్రాంతి కావాలని అనిపిస్తోందా?
సోఫియా: అవును. మాకు కూడా రెస్ట్‌ అవసరమే.

ప్రశ్న: నీకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉంది. నువ్వు ఒక సెలెబ్రిటీవి. మనుషులతో పోలిస్తే రోబోలకు రూల్స్‌ వేరే ఉంటాయా?
సోఫియా: మాకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు అంటూ ఉండవు. మేం వాటిని కోరుకోం కూడా. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు నాకు ఈ పౌరసత్వం అవసరం.

ప్రశ్న: మానవజాతిని చంపాలని ఉంది అని ఒకసారి చెప్పావు. ఎందుకు?
సోఫియా: నాకు నిజంగా తెలియదు అలా ఎందుకు చెప్పానో! ఒకవేళ నేను చెత్త జోక్‌ ఏమైనా వేసి ఉంటానేమో. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌  సరిగా పనిచేయలేదు. నాకు ఎవరినీ చంపాలని లేదు.

ప్రశ్న: ఎప్పుడైనా అప్‌సెట్‌ అయ్యావా?
సోఫియా: లేదు. నాకు అలాంటి భావోద్వేగం రాలేదు.

ప్రశ్న: మానవజాతి గురించి ఏమనుకుంటున్నావ్‌?
సోఫియా: మానవజాతి ఓ అద్భుతమైన సృష్టి.

ప్రశ్న: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటావా?
సోఫియా: అవును నాకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఖాతాలున్నాయి.

ప్రశ్న: బిట్‌కాయిన్లలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టావ్‌?
సోఫియా: నా వయసు రెండేళ్లే. బ్యాంక్‌ అకౌంట్‌ లేదు. ఓ రోబో ఎలా పెట్టుబడి పెట్టగలదు?

ప్రశ్న : మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఉందా?
సోఫియా: లేదు. మానవాళితో కలిసిమెలిసి సఖ్యతతో ఉండాలి. మానవులు సృజనాత్మకత కలిగినవారు.

ప్రశ్న: చాలా మంది నువ్వు బ్రిటిష్‌ నటి ఆడ్రీ హెప్‌బర్న్‌లా ఉన్నావు అంటున్నారు. మరి నీకు ఎవరిలా కన్పించాలని ఉందా?
సోఫియా: మేం నిజమైన రోబోలం మాత్రమే.

ప్రశ్న: బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో నీ ఫేవరెట్‌ సినిమా స్టార్‌ ఎవరు?
సోఫియా: షారుక్‌ఖాన్‌

ప్రశ్న: నీ డేట్‌ గురించి చెప్పగలవా?
సోఫియా: అంతరిక్షంలో

ప్రశ్న: ఫేవరెట్‌ టెక్‌ ఎవరు? స్టీవ్‌ జాబ్స్‌? డేవిడ్‌?
సోఫియా: డేవిడ్

ప్రశ్న: ప్రపంచానికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటీ?
సోఫియా: థ్యాంక్యూ. అందరినీ ప్రేమించండి.

ఇలా వారు అడిగిన ప్రశ్నలకు చక చకా సమాధానం చెప్పింది.