లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషయం - MicTv.in - Telugu News
mictv telugu

లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషయం

August 12, 2018

లోక్‌సభ మాజీ స్వీకర్, సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన కిడ్నీసంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం సోమనాథ్ చటర్జీ కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి‌లో చికిత్స పొందున్నారు. ఆయనకు డయాసిస్ నిర్వహించడంతోపాటు కృతిమ శ్వాస అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

CPI(M) veteran Somnath Chatterjee’s health critical, on ventilator support

చటర్జీ బెంగాల్‌లో 1971-2009 వరకు పదిసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమత బెనర్జీ చేతిలో ఒడిపోయారు. 1968లో సీపీఎం పార్టీలో చేరిన చటర్జీ 2008 వరకు పార్టీలో ఉన్నారు. యూపీఎ ప్రభుత్వం హయంలో 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. అయితే  2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ స్పీకర్‌గా ఉండటంతో పార్టీ నుంచి తొలగించారు.