ఏనుగుల కోసం మంత్రికి సోనాక్షి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగుల కోసం మంత్రికి సోనాక్షి లేఖ

February 7, 2018

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రాజస్థాన్ అటవీశాఖ మంత్రి గజేంద్రసింగ్ కు లేఖ రాసింది. జైపూర్ నగరంలో  పర్యాటన కోసం వచ్చే పర్యాటకుల సవారీ కోసం ఉపయోగిస్తున్న ఏనుగులకు విముక్తి కల్పించాలని కోరింది.


జైపూర్‌లో అంబర్ కోట ప్రాంతంలో ఓ ఏనుగును 8మంది అత్యంత దారుణంగా కొడుతుండగా అమెరికాకు చెందిన పర్యాటకులు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు ఆధారంగా ఏనుగును హింసించిన వారిపై వన్యప్రాణి పరిక్షణ చట్టం కింద చర్య తీసుకోవాలని సోనాక్షి కోరింది. పర్యాటకుల సఫారీ నుంచి ఏనుగులకు స్వేచ్ఛ ప్రసాదించాలని మంత్రిని అభ్యర్థించింది. సోనాక్షి లేఖపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఏనుగు సంరక్షకులకు నోటీసులు జారీ చేసి వాటిని స్వాదీనం చేసుకున్నారు. సోనాక్షి బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా గారాల తనయ. ఆమె జంతువుల హక్కుల సంస్ధ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) భారత్ తరుపున నుంచి సోనాక్షి లేఖ రాసింది.