‘ఖచ్చితంగా చెబుతాను ఆమె నా హీరో’.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఖచ్చితంగా చెబుతాను ఆమె నా హీరో’.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

August 12, 2018

హైగ్రేడ్ క్యాన్సర్ గురైన నటి సోనాలి బింద్రేను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స పొందుతుంది. ఆమెను కలిసిన విషయాన్ని అనుపమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘సోనాలి బింద్రేతో కలిసి కొన్ని సిమాల్లో నటించాను. ముంబాయిలో జరిగిన కొన్ని కార్యక్రమాలు, సమావేశాల్లో మేము చాలా సార్లు కలిశాం. అప్పటి నుంచి మళ్లీ కలవలేదు.. ఆమెను కలిసే అవకాశం, సమయం గడిను అవకాశం ఇప్పుడు లభించింది. నేను కచ్చితంగా చెప్పగలను ఆమె నా హీరో’ అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

కాగా సోనాలి బింద్రేకు క్యాన్సర్ వచ్చినా.. ఆమె ఏమాత్రం దిగులు చెందకుండా, గుండె ధైర్యంతో ఉంది. ఆమె అభిమానులు సోనాలికి తొందరగా నయం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.