మేలో సోనమ్ కపూర్ పెళ్లి... వరుడు ఎవరంటే... - MicTv.in - Telugu News
mictv telugu

మేలో సోనమ్ కపూర్ పెళ్లి… వరుడు ఎవరంటే…

April 16, 2018

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తనయ బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ పెళ్లి సందడి షురూ అయింది.  గత కొంతకాలంగా సోనమ్ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహోజాతో ప్రేమలో మునిగి తేలుతోంది. వీరి వివాహం  మే మొదటి వారంలో జరగనుంది. మొదట స్విట్జర్లాండ్‌లో సోనమ్ పెళ్లి జరగనుందని వార్తలు వచ్చాయి.కానీ కుటుంబ సభ్యులంతా ముంబైలోనే ఉండడంతో ముంబైలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్‌ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌,ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌  దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఈ సందర్భంగా సోనమ్‌ ,ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో అనిల్‌కపూర్‌కి చెందిన బంగ్లాలో సంగీత్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నట్లు సోనమ్‌ సన్నిహితులు తెలిపారు.ఈ వేడుకకు సోనమ్‌, ఆనంద్‌ కుటుంబీకులంతా హాజరు కాబోతున్నారు. సోనమ్‌ నటించిన సినిమాల పాటలకే డ్యాన్సులు కంపోజ్‌ చేస్తున్నారు. వివాహం అనంతరం ముంబయి, ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుతం సోనమ్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తోంది. వివాహమైన మూడురోజుల తర్వాత తిరిగి చిత్రీకరణలో పాల్గొంటుంది.