500 కోట్ల మంది చూసిన పాట తెలుగులో.. - MicTv.in - Telugu News
mictv telugu

500 కోట్ల మంది చూసిన పాట తెలుగులో..

March 17, 2018

డెస్పాసిటో’.. సంగీత ప్రపంచంలో రారాజులా వెలిగిపోతున్న పాట. దీన్ని స్పానిష్,ఇంగ్లీష్‌లలో వ్యూర్టోరికోకి చెందిన గాయకులు లాయిస్ ఫోన్ని, డాడీ యాంకీలు పాడారు. 2017లో విడుదలైన ఈ పాటకు కేవలం 16 వారాల్లోనే యూట్యూబ్‌లో 300 కోట్లమందికి పైగా వీక్షించారు. అతి తక్కువ కాలంలోనే ఈ పాటను ఇప్పటి వరకు దాదాపు 500 కోట్లమంది చూశారు.

ఈ పాటకు సంబంధించి అనేక పేరిడీ పాటలు కూడ ాయూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. ప్రముఖ గాయకుడు నోయల్ దీన్ని ట్విటర్లో వదిలాడు. నోయల్‌, గాయని ఎస్తర్‌ నొరాహాలు కలిసి దీన్ని ఆలపించారు. మూలంలోని పాటతో పోలిస్తే కొన్ని తేడాలు ఉన్నాయి. ‘డెస్పాసిటో’పాటలో గాయకులు లూయిస్‌, డాడీ యాంకీలు కలిసి ఆడిపాడుతూ ఉంటారు. నోయల్‌ చేసిన పాటలో మాత్రం అతనితో కలిసి ఎస్తర్‌ ఓ ప్రేమ గీతాన్ని పాడుతున్నట్లుగా ఉంది. దీన్ని ఇప్పటివరకూ 3 లక్షమందికితపైగా వీక్షించారు.