అస్వస్థతకు గురైన సోనియా గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

అస్వస్థతకు గురైన సోనియా గాంధీ

March 23, 2018

కూతురు ప్రియాంక వాద్రాతో సిమ్లా పర్యటనలో వున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు.  ప్రియాంకతో కలసి బుధవారం సిమ్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చరబ్రా గ్రామాన్ని సందర్శించారు. అక్కడే ప్రియాంక కాటేజీ నిర్మాణం జరుగుతోంది. అక్కడి పనులను విశ్లేషిస్తున్న సోనియా గాంధీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు.నిన్న రాత్రి చండీగఢ్‌లోని  ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు సోనియా నిరాకరించడంతో, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోనియాగాంధీ పరిస్థితి నిలకడగానే ఉందని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ చంద్ తెలిపారు.