కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన కడుపు నొప్పితో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
భుజానికి స్వల్ప గాయంతోపాటు, శ్వాసకోశ సమస్యలతో కూడా సోనియా బాధ పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యస్థితి గురించి పార్టీ వర్గాలు ఏమీ చెప్పడం లేదు. ఒక్క రోజు విశ్రాంతి కోసం సోనియా సిమ్లా పర్యటనకు వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం తరచూ అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడు రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.