సూకీ ఇంటిపై బాంబు దాడి - MicTv.in - Telugu News
mictv telugu

సూకీ ఇంటిపై బాంబు దాడి

February 1, 2018

గుర్తు తెలియని దుండగులు మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఆ సమయంలో సూకీ ఇంట్లో లేకపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని స్టేట్ కౌన్సిలర్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ జా హట్ అధికారికంగా ప్రకటించారు.యాంగ్యాన్‌లోని ఆమె ఇంటి ఆవరణలో పెట్రోల్ బాంబ్ విసిరినట్టు తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్సందించడంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారన్నారు. కాగా ఈ దాడి వెనక ఎవరున్నారు, దాడికి గల కారణాలు గురించి విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.