జరిగినదానికి క్షమించండి.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావు - MicTv.in - Telugu News
mictv telugu

జరిగినదానికి క్షమించండి.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావు

March 22, 2018

‘ జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి.. ఇది మాకో గుణపాఠం.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం ’ అని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేస్‌బుక్ డేటా లీక్‌పై ఆయన స్పందించారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా యూజర్లందరి డేటాను గోప్యంగా ఉంచడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అనే విషయంపై ప్రస్తుతం పని చేస్తున్నామని.. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.‘ ఈ సమస్యను అధిగమించడానికి మాకు చాలా సమయం పడుతుంది. అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు మా టీం కృషి చేస్తుంది. ఇలాంటివి జరుగుతాయని కొన్ని సంవత్సరాల క్రితమే ఊహించాం. వాటికోసం అప్పట్లోనే జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. మాలోని కొన్ని తప్పిదాల వలనే ఇలా జరిగింది. అలాగే ఈ సమయంలో మాకు మద్దతుగా ఉన్న వారందరికీ కృతఙ్ఞతలు ’ అని జుకర్‌బర్గ్ తెలిపారు.