రూ.6500 కోట్లు చెల్లించి విడుదలయ్యాడు - MicTv.in - Telugu News
mictv telugu

రూ.6500 కోట్లు చెల్లించి విడుదలయ్యాడు

November 30, 2017

రాజుల సొమ్ము రాళ్ల పాలు అని అంటారు కానీ ఇక్కడ రాజులే  ప్రజల సొమ్మును అడ్డంగా నొక్కేసి, అధికారం చేతులో ఉంది కదా అని ఇష్టమచ్చినట్లు ఆటాడారు. ఆ తర్వాత అక్రమ ఆస్తుల సంపాదన కేసులో అరెస్ట్ అయ్యి, ప్రజలనుంచి, ప్రభుత్వం నుంచి దోచుకున్న సొమ్మునే ప్రభుత్వానికి లంచంగా ఇచ్చి జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ సంపాదన కేసులో సౌదీ ప్రభుత్వం 12 మంది యువరాజులను జైలుకు పంపారు. వీరిలో సౌదీ సింహాసనం కోసం పోటీపడుతోన్న యువరాజుల్లో మితేబ్ బిన్ అబ్దుల్లా ప్రభుత్వానికి ఒక బిలియన్ డాలర్లు అంటే రూ.6,500 కోట్లు లంచంగా ఇచ్చి జైలునుంచి విడుదలయ్యారు.అరెస్ట్ చేసిన వారిలో విడుదలైన తొలి వ్యక్తి మితేబే. అక్రమ సంపాదనలో సుమారు 200 మందిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ దాదాపు 100 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వారు కూడా అవినీతి ధనాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే వారిని కూడా విడుదల చేస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.