mictv telugu

జగన్ పార్టీలో చేరిన భానుచందర్

January 9, 2019

మరో దక్షిణాది సినీనటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. నిరీక్షణ, సూత్రధారులు వంటి హిట్ చిత్రాలలో నటించిన భానుచందర్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర చివరి రోజు వైఎస్ జగన్‌ను కలిసిన ఆయన… వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి భానుచందర్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు జగన్. భానుచందర్‌తో పాటు మరికొందరు నటులు పృథ్వీ, పోసానిలు కూడా త్వరలో వైఎసార్సీపి పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.