పారితోషికం తిరిగి ఇచ్చేసిన సాయిపల్లవి - MicTv.in - Telugu News
mictv telugu

పారితోషికం తిరిగి ఇచ్చేసిన సాయిపల్లవి

January 8, 2019

హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి… ఇప్పుడు ఈ పేరు తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని భాష‌ల‌ చిత్రసీమల్లో మారి మ్రోగిపోతుంది. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసిన ఈ నాచ్యురల్ బ్యూటీ రీసెంట్‌గా ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. శ‌ర్వానంద్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందించాడు. ఈ చిత్రంతో శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. కాని క‌థ జ‌నాల‌కి కాస్త బోర్ కొట్టించ‌డంతో మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.Telugu News south actress sai pallavi return her remuneration to producersఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల‌కి కాస్త న‌ష్టం కూడా చేకూరిందని స‌మాచారం. అయితే ఈ విష‌యం తెలుసుకున్న సాయిపల్లవి తన రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందట. ఇప్ప‌టి వ‌ర‌కు రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ని ఇలా తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలను చూశాం. కానీ, నిర్మాత గురించి ఆలోచించిన హీరోయిన్ త‌న పారితోషికాన్ని తిరిగి ఇవ్వ‌డ‌మ‌నేది గొప్ప విష‌యం అని అంటున్నారు. సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.