రైల్వేలో 26,502 ఉద్యోగాలకు నోటిఫికేషన్! - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేలో 26,502 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

February 3, 2018

రైల్వేలో  కొలువు జాతర షురువైంది. పలు విభాగాల్లో  ఉద్యోగాలకు నోటిఫికేషన్  విడుదలైంది.  మొత్తం 26,502 ఉద్యోగాలను  భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.  దక్షిణ మధ్య రైల్వే  సికింద్రాబాద్‌కు 3262  పోస్టులను  భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో ఉన్న అభ్యర్థులు దక్షిణ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ల పరిధిలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్లుగా  ఎంపికైన వారికి  నెలకు  రూ. 45 వేల దాకా జీతం  వస్తుంది. మరింకే  శ్రద్ధ పెట్టి కొంచెం కష్టపడితే  సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీదే కావచ్చు.ఖాళీగా ఉన్న విభాగాలు :

అర్మేచర్ కాయిల్ వైండర్, బ్లాక్‌స్మిత్, బుక్ బైండర్, కార్పెంటర్, క్రేన్ డ్రైవర్, డీజిల్ మెకానిక్, మెషీనిస్ట్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, పంప్ ఆపరేటర్, రిగ్గర్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, వెల్డర్, ఫిట్టర్, మల్టీస్కిల్డ్ ఫిట్టర్.

అసిస్టెంట్ లోకో పైల‌ట్‌: 17673

టెక్నీషియ‌న్: 8829

మొత్తం పోస్టుల సంఖ్య: 26,502

విద్యార్హత‌లు :

ప‌దో త‌ర‌గ‌తితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ అప్రెంటీస్‌షిప్ లేదా మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్/ సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.