పందెం కోడి పెళ్లాడబోయేది ఈమెనే..

సౌతిండియా స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని ఆయన తండ్రి జీకే రెడ్డి అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్తా వినగానే ఒక్కసారిగా చిత్రసీమ షాక్ అయింది. హీరోయిన్ వరలక్ష్మి, విశాల్‌లు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఈ క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.Telugu News south star vishal to marry aneesha from hyderabadఈ సంవత్సరమే విశాల్ పెళ్లి జరగనుందట. విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా. వీరికి త్వరలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతుంది. దీంతో అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. ఇప్పుడు ఆమె ఫోటో బయటకి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె. ఇలా ఇలా ఉండగా.. నడిగర్ సంఘం భవనం పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ నాటికి భవనం నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఈలోగా నిశ్చితార్ధం జరిపి పెళ్లి డేట్‌ని ఫైనల్ చేయనున్నారు.