ఆ డ్రాప్స్ కోసం వేలమంది క్యూ.. ముఖం తళతళ..   - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డ్రాప్స్ కోసం వేలమంది క్యూ.. ముఖం తళతళ..  

February 9, 2019

కేవలం నాలుగు నాలుగు చుక్కలంట.. చేతిలో వేసుకుని ముఖానికి రాస్తే మచ్చలన్నీ పోయి ముఖం కొత్త ఇత్తడిబిందెలా తళతళా మెరిసిపోతుందట. యూరప్ దేశాల్లో ఓ ఫేసియల్ సీరంపై సాగుతున్న ప్రచారం ఇది. దీన్ని వాడిన సెలబ్రిటీ 100 పాజిటివ్ రేటింగ్స్ ఇవ్వడంతో అది కాస్తా కొండెక్కి కూర్చుంది. షాపుల్లో, ఆన్లైన్‌లో పెట్టిన కొన్ని నిమిషాలకే అమ్ముడుబోతోందంటే దానిపై జనంలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.Telugu news spanish facial serum facial drops Azelac Ru Liposomal Serum sold out within 24 hours of its UK launch is finally back in stock - but you'll have to act fast if you want to try it for yourselfస్పెయిన్ కంపెనీ సెస్ డెర్మా.. అజెలిక్ రూ లిపోజమాల్ సీరమ్ పేరుతో దీన్ని అమ్మేస్తోంది. బ్రిటన్ లో దీన్ని లాంచ్ చేయగా, ఒకరోజులోనే స్టాకంతా అయిపోయింది. అర నిమిషానికి ఒకటి చొప్పున అప్పేశారు. 30 మిల్లీలీటర్ల ధర దాదాపు రూ. 3800. దీనికోసం బ్రిటన్లో ఇప్పటికి 6 వేల మందికిపైగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఈ సీరంను Tranexamic Acid TRX Booster System తో తయారు చేశారు. ఇది నచ్చమచ్చలను పోగొట్టి, ముఖాన్ని కాంతిమంతం చేస్తోదని సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. జనం కూడా ఇది తమకు బాగా పనిచేస్తోందంటున్నారు.