రైల్వేలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక సదుపాయం - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక సదుపాయం

October 31, 2017

రైల్వే టికెట్ల రిజర్వేషన్ల దరఖాస్తులలో ఇప్పటివరకు ‘M’(పురుషులు), ‘F’ (స్త్రీలు) అనే ఆప్షన్లు ఉండేవి, కానీ ఇకనుంచి ‘T’ (ట్రాన్స్ జెండర్) ఆప్షన్‌ను కూడా చేర్చబోతున్నారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని అన్ని రైల్వేజోన్లకు, రైల్వేబోర్డు లేఖ రాసింది.

టికెట్‌ బుకింగ్, రద్దు దరఖాస్తులలో ‘ట్రాన్స్‌జెండర్‌’ ఆప్షన్‌ను కచ్చితంగా పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. 2014లో సుప్రీం కోర్టు.. అన్ని దరఖాస్తుల్లో ‘థర్డ్‌ జెండర్‌’ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డు, బ్యాంకు ఫారాల్లో ‘TG’ (థర్డ్‌ జెండర్‌), ‘T’ (ట్రాన్స్‌జెండర్‌) ఆప్షన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.