‘ లీక్స్ స్టార్టెడ్ ’ అంటూ ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టిన శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

‘ లీక్స్ స్టార్టెడ్ ’ అంటూ ఫేస్‌బుక్‌లో ఫోటో పెట్టిన శ్రీరెడ్డి

March 26, 2018

కాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమస్థాయిలో విజృంభిస్తున్న నటి శ్రీరెడ్డి ‘ లీక్స్ స్టార్టెడ్ ’ అంటూ ఓ ఫోటోను బయట పెట్టింది. ఎప్పటినుంచో టాలీవుడ్‌లో కొందరి బడాబాబుల పేర్లను బహిర్గతం చేస్తానని అంటున్న శ్రీరెడ్డి లీక్స్ మొదలెపెట్టింది. ‘ నేను లీక్స్ మొదలు పెడితే ఒక్కొక్కరి గుండెలు జలదరించాలి ’ అన్న శ్రీరెడ్డి ఎంతమంది ఫోటోలు బయటపెట్టనుందోనని అనుకుంటున్నారు.  తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోలో వున్న వ్యక్తి ఎవరో ముఖం కనిపించనట్టుగా వుంది. ఇందులో ముఖం కనిపించని ఆ వ్యక్తి శ్రీ రెడ్డిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ‘లీక్స్ స్టార్టెడ్’ అంటూ శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఆమె ఇంకా ఎంతమంది ఫోటోలు లీక్ చేస్తుందోనని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.