బట్టలు విప్పేసింది.. అన్నంత పని చేసిన శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

బట్టలు విప్పేసింది.. అన్నంత పని చేసిన శ్రీరెడ్డి

April 7, 2018

నటి శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట బట్టలు విప్పేసి తన నిరసన తెలిపింది. చాలా రోజులుగా శ్రీరెడ్డి అంటున్న మాట ఇది. నేను ఏదో ఒకరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు బట్టలు విప్పేసి నిరసన తెలుపుతానని చెప్పింది. తనకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వకుండా అన్యాయం చేశారని శ్రీరెడ్డి ఇలా నిరసనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. ఉదయం శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌కు వెళ్లింది.ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ముందు తన ఒంటిపై ఉన్న బట్టలను విప్పేసింది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. అందరూ అవాక్కయిపోయారు. ‘ నా ఆవేదనను వ్యక్తం చేసినా సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ చర్యకు పూనుకొన్నాను. ఒక ఆడదాని బాధను అర్థం చేసుకోవటం లేదు. నామీద కేసులు పెడతానని అంటున్నారు తప్పితే ఒక తెలుగు అమ్మాయి బాధను అర్థం చేసుకోవటం లేదు ’ అని శ్రీరెడ్డి మీడియాకు వివరించింది.