శ్రీలంకలో మతఘర్షణలు.. ఎమర్జెన్సీ... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో మతఘర్షణలు.. ఎమర్జెన్సీ…

March 6, 2018

శ్రీలంకలో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. కాండి జిల్లాలో బౌద్ధులకు, ముస్లిలకు మధ్య తీవ్ర మతఘర్షణలు జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అల్లర్లలో  ఇద్దరు మణించారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం10 రోజులు పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు మంత్రి ఎస్ .బి దిస్సనాయకే తెలిపారు. దేశంలో మిగతా ప్రాంతాలకు ఈ ఘర్షణలు విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆధ్వర్యంలో మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ప్రజలను సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఆయన  హెచ్చరించారు. పది రోజుల పరిస్థితులను బట్టి అత్యవసర స్థితిని పొడగించాలా లేదా అనే దానిపై అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు. పరిస్థితులను అదుపు చేసేందుకు కాండి జిల్లాలో పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఎత్తున  బలగాలను పింపింది. కర్ఫ్యూ కూడా విధించింది.