పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయిన శ్రీరెడ్డి

April 19, 2018

పవన్ ఫ్యాన్స్‌పై శ్రీరెడ్డి ఫైర్ అయింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ ఇది పురుషాధిక్య సమాజం. ఇక్కడ ఆడవాళ్ళకు గౌరవం లేదని తెలుస్తోంది. ముప్ఫై, నలభై మంది పవన్ ఫ్యాన్స్ నాకు బ్యాడ్ మెసేజ్‌లు పంపడం వల్ల గానీ నన్ను ట్రోల్ చేస్తూ చెత్త వీడియోలు పంపడాన్ని నేను పట్టించుకోను. కోట్ల మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు.ఎందరో ఆర్టిస్టుల సమస్యల మీద నేను పోరాడుతున్నాను. మీ ఫ్యాన్స్ అంతా కలిసి ఏం పీకలేరని కత్తి మహేష్ చెప్పారు కదా. అదీ మీకిష్టమైన భాషలోనే. మీకు దమ్ముంటే రాంగోపాల్ వర్మను ఏమైనా పీకగలరా ? వాళ్ళను ఏం పీకలేక నామీద పడ్డారు. ఆడిపిల్లనైన నామీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు. మీరంతా కట్టగలిసి పవన్ పరువు తీస్తున్నారు. ఆ పేరును వాడుకుని చెలరేగిపోతున్నారు. ఈ ప్రపంచం సిగ్గుపడుతోంది మీమీద జాలితో. థూ.. ’ అని పోస్ట్ పెట్టింది.