శేఖర్ కమ్ములా.. తప్పు చేయకపోతే సైలెంట్‌గా ఉండు?: శ్రీరెడ్డి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

శేఖర్ కమ్ములా.. తప్పు చేయకపోతే సైలెంట్‌గా ఉండు?: శ్రీరెడ్డి ఫైర్

April 4, 2018

నటి శ్రీరెడ్డి టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములపై మరోసారి విరుచుకుపడింది. ‘నేను సోషల్ మీడియాలో నాకు నచ్చింది రాసుకుంటాను. నీ పేరు మెన్షన్ చేశానా? లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా? నన్ను జైల్లో పెట్టిస్తానంటున్నావు. చట్ట ప్రకారం వెళ్తవా? వెళ్లు, నాకేమైనా భయమా? నువ్వు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?’ అని సూటిగా ప్రశ్నించింది.‘సినీ పెద్దలకు అందరికి ఒకటే చెబుతున్నాను.నేను ఒంటరి దానిని అయినప్పటికి, నాకు చాలా ధైర్యం ఉంది. పోరాటానికి డబ్బులు అవసరం లేదు. గుండెలో ధైర్యం ఉంటే చాలు. మీరు తప్పు చేయనప్పుడు సైలెంట్‌గా ఉండచ్చుకదా? నేను కూడా లీగల్‌గా చర్యలను తీసుకుబోతున్నాను. త్వరలోనే నోటీసులు అందుతాయి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడానికి ప్రయత్నంచకండి’ అంటూ చాలా ఘాటుగా స్పందించింది.

తెలుగు అమ్మాయిలు కేవలం పక్కలోకి మాత్రమే పనికొస్తారని శేఖర్ కమ్ముల భావిస్తాడని, అతడు తన ఇంటి చుట్టూ తిరిగాడని, బక్కపీచు సోగ్గాడని శ్రీరెడ్డి ఆరోపించింది. దీనిపై శేఖర్ భగ్గుమన్నాడు. క్షమాపణ చెప్పాలని ఆమెను డిమాండ్ చేశాడు.

టాలీవుడ్‌లోని కొందరు పెద్దమనుషులుగా నటిస్తూ తెలుగు  అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుండడం తెలిసిందే.