ఎట్టకేలకు శ్రీదేవి  మృతదేహాన్ని అప్పగించారు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు శ్రీదేవి  మృతదేహాన్ని అప్పగించారు !

February 27, 2018

శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు దుబాయ్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసులు  అనుమతించారు. దీనికి సంబంధించిన క్లియరెన్స్  లేఖను  భారత కాన్సులేట్ కు, శ్రీదేవి కుటుంబానికి జారీ చేశారు. ప్రస్తుతం  శ్రీదేవి మృతదేహానికి ఎంబల్మింగ్‌కు నిర్వహిస్తారు. దీనికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది.  దుబాయ్ చట్టాల ప్రకారం అన్ని కేసుల లాగే  శ్రీదేవి విషయంలో వ్యవహరిస్తున్నామని,భారత మీడియా కొంచెం ఓపిక పట్టాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. బహుశా మంగళవారం రాత్రికి  శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకోనుంది.దుబాయ్ లో పెళ్లికి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందిందని అందరూ భావించిన విషయం తెలిసిందే. అయితే ఫోరెనిక్స్ రిపోర్ట్  రావడంతో శ్రీదేవి  మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. చివరికి కేసు నమోదు చేసిన పోలీసులు..ఈ కేసును దుబాయ్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు.