కాసేపట్లో ముంబైకి శ్రీదేవి మృతదేహం…రేపు అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

కాసేపట్లో ముంబైకి శ్రీదేవి మృతదేహం…రేపు అంత్యక్రియలు

February 27, 2018

శ్రీదేవి భౌతికకాయం మరికొన్ని గంటల్లో ముంబై చేరుకోనుంది. రాత్రి  పది,పదకొండు గంటల ప్రాంతంలో ముంబైలోని ఛత్రపతి విమానాశ్రయానికి చేరనుంది. అంబానీకి చెందిన ఛార్టెడ్ విమానంలో  శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకువస్తున్నారు.రేపు(బుధవారం) ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిమానుల సందర్శన కోసం అనుమతించనున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు పవన్ హన్స్ స్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి.