శ్రీదేవి అంటే గౌరవం.. అర్జున్ కపూర్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి అంటే గౌరవం.. అర్జున్ కపూర్

February 28, 2018

ప్రముఖ నటి శ్రీదేవికి, ఆమె భర్త బోనీ కపూర్‌ మొదటి భార్య సంతానానికి వివాదాలు ఉన్నాయని  ప్రచారం. శ్రీదేవి తమ కుటుంబంలో చిచ్చుపెట్టిందని వారు మండిపోతున్నట్లు వార్తలు వచ్చాయి.  ముఖ్యంగా బోనీ మొదటి భార్య మోనా కొడుకు, నటుడు అర్జున్ కపూర్.. శ్రీదేవిని వేధించేవాడని అంటారు. శ్రీదేవి మరణం నేపథ్యంలో అర్జున్ కాస్త  మెత్తబడినట్లు కనిపిస్తోంది.

శ్రీదేవి భౌతిక కాయాన్ని తీసుకురావడానికి అర్జున్ కూడా దుబాయ్ వెళ్లాడు. తనపై వస్తున్న ఆరోపణలపై మీడియా ముందు స్పందించాడు. ‘సూపర్ స్టార్ శ్రీదేవి అంటే నాకు ఎంతో గౌరవం. ఆమె పట్ల, ఆమె కుటుంబం పట్ల నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. మా నాన్న జీవితంలోకి ప్రవేశించిన ఎవరికైనా నేను గౌరవం ఇస్తాను. అలాగే శ్రీదేవి కూడా ఇస్తాను. అలాగే ఎవరికీ కీడు జరగాలని కోరుకోను’ అని వెల్లడించాడు.

అర్జున్ కపూర్ బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో ఓ ఇంటర్వ్యూలో తనకు శ్రీదేవికి ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. ‘శ్రీదేవి, ఆమె కుమార్తెలను కలవడానికి ఇష్టపడను.ఇకపైనా మేం ఎప్పుడూ  కలుసుకోం’ అన్నాడు. అయితే శ్రీదేవి ఇవన్నీ మనసులో పెట్టుకునేది కాదు. అర్జున్ కపూర్ బాలీవుడ్‌లో బాగా రాణించాలని ఆమె కోరుకునేదని సన్నిహితులు  చెబుతుండేవారు.