శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేశారు..

February 27, 2018

శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించిన దుబాయ్ ప్రాసిక్యూషన్..ఆమె మృతికి సంబంధించిన కేసును మూసేస్తున్నట్లు చెప్పారు. పలు రకాలుగా కేసును పరిశీలించిన  ప్రాసిక్యూషన్ ఫోరెన్సిక్ రిపోర్టులలో ఎలాంటి లోపం లేదని తెలిపింది.  శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు ప్రాసిక్యూషన్ కూడా ధ్రువీకరించింది.మరికాసేపట్లో శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి రిలయన్స్ ప్రైవేట్ జెట్‌లో నేరుగా ముంబైకు తీసుకురానున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు ఆమె అభిమానులు..శ్రీదేవి ఇంటివద్ద వేయి కన్నలతో వేచి చూస్తున్నారు.