గుండెపోటుతో కాదు... ప్రమాదం వల్లే శ్రీదేవి మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

గుండెపోటుతో కాదు… ప్రమాదం వల్లే శ్రీదేవి మృతి!

February 26, 2018

శ్రీదేవి మరణంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.  మొదట ఆమె గుండెపోటు రావడంతో చనిపోయిందని  అందరూ అనుకున్నారు. కానీ శ్రీదేవికి పోస్ట్ మార్టం  నిర్వహించిన  వైద్యులు..డెత్ సర్టిఫికెట్ లో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

బాత్రూంలో బాత్ టబ్‌లో పడి  ఊపిరి ఆడక  శ్రీదేవి చనిపోయినట్లు  డెత్ సర్టిఫికెట్ లో నిర్థారించారు.  అయితే ఆమె రక్త నమూనాలో  ఆల్కాహాల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.  బాత్‌రూంలోకి వెళ్లిన శ్రీదేవి ప్రమాదవవాత్తు   బాత్ టబ్ లో పడిపోయిందని, అందులో నీరు ఉండడంతోె శ్రీదేవి ఊపిరి ఆడక చనిపోయిందని  ఫోరెనిక్స్  నివేదికలో తేలింది.  అక్కడి అధికారులు పోలీసులకు ఫోరెన్సిక్‌ నివేదికను అందజేశారు.

ఇక దుబాయ్ నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై తీసుకువచ్చేందుకు ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు  కొనసాగుతున్నాయి. ఈ రాత్రికి  శ్రీదేవి  పార్థివదేహం  ముంబైకి చేరుకోనుంది. ఇప్పటికే శ్రీదేవి  ఇంటివద్దకు  ఆమె అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.