శ్రీదేవి సాయం వల్లే నా సోదరుడు బతికాడు.. ఓ అంధుడి కన్నీరు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి సాయం వల్లే నా సోదరుడు బతికాడు.. ఓ అంధుడి కన్నీరు

February 28, 2018

మనుషులు చనిపోయినా కూడా వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.  అందుకు నిదర్శనమే శ్రీదేవి .ఆమె మరణవార్తతో విని  ఓ అంధ అభిమాని గుండె పగిలి పోయింది. అతని పేరు జతిన్ వాల్మీకి. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి గత మూడు రోజుల నుంచి శ్రీదేవి నివాసం వద్దనే వేచి చూస్తున్నాడు.‘నాకు కళ్లు కనిపించవు. శ్రీదేవి సినిమాలను చూడలేదు. కానీ ఆమె మంచితనం మాత్రం నాకు తెలుసు. ఓ కార్యక్రమం సందర్భంగా ఆమెను కలుసుకున్నా. నా సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పా. వెంటనే  ఏ మాత్రం ఆలోచించకుండా రూ.1లక్ష చెక్కు ఇచ్చేసింది. శ్రీదేవి ఆర్థికసాయం చేసిన విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం కూడా ఫీజులో మరో లక్ష తగ్గించింది. ఆమె దయ వల్లనే నా సోదరుడు ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు. అంతగొప్ప మనిషి ఇకలేదని తెలువగానే, కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చా. ఈ విధంగానైనా కృతజ్ఞతలు తెలుపుకుంటా’ అంటూ ఎంతో ఆవేదనతో చెప్పాడు.