అధికార లాంఛనాలతో శ్రీదేవికి తుది వీడ్కోలు - MicTv.in - Telugu News
mictv telugu

అధికార లాంఛనాలతో శ్రీదేవికి తుది వీడ్కోలు

February 28, 2018

యావత్ భారతావని ప్రేక్షకులను అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి అంత్యక్రియలను కూడా అంతే ఘనంగా నిర్వహించనున్నారు. ముంబైలోని పవన్ హన్స్ హిందూ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:30 నిమిషాలకు అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి అధికార లాంఛనాలతో వీటిని నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లును చేస్తోంది. అందుకోసం ముంబై పోలీసు బ్యాండ్ సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌కు చేరుకున్నది. ప్రస్తుతం శ్రీదేవి భౌతికాయాన్నిసెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో అభిమానుల, ప్రముఖుల సందర్శార్థం ఉంచారు.